Namaste NRI

అయిదేళ్ల క్రితం ‌ఘ‌ట‌న‌.. ఆ బాధితుడి పేరెంట్స్‌కు 100 మిలియ‌న్ల డాల‌ర్ల ప‌రిహారం

అమెరికాలోని నెవ‌డా రాష్ట్రంలో ఉన్న గ్రాండ్ కేనియ‌న్ ప‌ర్యాట‌క ప్ర‌దేశంలో అయిదేళ్ల క్రితం హెలికాప్ట‌ర్ కూలిన ‌ఘ‌ట‌న‌లో అయిదుగురు మృతిచెందారు. అయితే ఆ బాధితుల్లో ఒక‌రి పేరెంట్స్‌కు భారీ న‌ష్ట‌ ప‌రిహా రాన్ని చెల్లించ‌నున్నారు. సుమారు వంద మిలియ‌న్ల డాల‌ర్లు ఇవ్వాలంటూ ఆ హెలికాప్ట‌ర్ నిర్వాహాకు ల‌కు నెవ‌డా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జోనాథ‌న్ ఉడాల్ అనే వ్య‌క్తి త‌న భార్య‌, మిత్రుల‌తో క‌లిసి నెవ‌డా టూర్‌కు వెళ్లారు. బ‌ర్త్ డే సంబ‌రాల్లో విషాదం చోటుచేసుకున్న‌ది. గ్రాండ్ కేనియ‌న్‌లో విహ‌రిస్తున్న స‌మ‌య‌లో ఆ విమానం కూలింది. ఈ కేసులో నెవ‌డా కోర్టు తీర్పును ఇచ్చింది. జోనాథ‌న్ పేరెంట్స్‌కు వంద మిలియ‌న్ల డాల‌ర్ల ప‌రిహారం ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. హెలికాప్ట‌ర్ ఆప‌రేట్ చేసిన‌ పాపిలియ‌న్ ఎయిర్వేస్ కంపెనీ 25 మిలియ‌న్ల డాల‌ర్లు, ఆ విమానం ఉత్ప‌త్తి చేసిన ఎయిర్‌బ‌స్ హెలికాప్ట‌ర్ సంస్థ 75 మిలియ‌న్ల డాల‌ర్లు చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events