Skip to main content

Namaste NRI

మేము ప్రేమతో చేశాం.. మీరు ప్రేమతో చూశారు

అడివి శేష్‌ కథానాయకుడిగా షానియల్‌ డియో దర్శకత్వంలో సుప్రియా యార్లగడ్డ నిర్మించిన డెకాయిట్‌ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో ప్రేక్షకులతో కలిసి చిత్రబృందం సినిమాను వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అడివి శేష్‌ మాట్లా డుతూ మేము ప్రేమతో ఈ సినిమా చేశాం. మీరు కూడా ప్రేమతో చూశారు. నాకు మరో సక్సెస్‌ ఇచ్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. విడుదలైన అన్ని కేంద్రాల నుంచి సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తున్నదని, త్వరలో చాలా నగరాలు తిరిగి ప్రేక్షకుల్ని కలుసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. సినిమాలో తాను పోషించిన సరస్వతి పాత్ర అందరికీ నచ్చిందని కథానాయిక మృణాల్‌ ఠాకూర్‌ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా విషయంలో తాము పెట్టుకున్న అంచనాలన్నీ నిజమయ్యాయని దర్శకుడు షానియల్‌ డియో తెలిపారు.


Social Share Spread Message

Latest News