Skip to main content

Namaste NRI

అప్పుడే అమెరికాతో శాంతి చర్చలు : మహ్మద్‌ ఘలీబాఫ్‌

తమ షరతులను నెరవేర్చే వరకు చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ బఖర్‌ ఘలీబాఫ్‌ స్పష్టం చేశారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ, స్తంభింపచేసిన తమ ఆస్తుల విడుదల ముందుగా జరగాలని ఆయన తెలిపారు. ముందుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చర్చలు ముందుకు కదలవని ఆయన స్పష్టం చేశారు. పక్షాల మధ్య పరస్పరం అంగీకారం కుదిరిన రెండు చర్యలు ఇంకా అమలు కాలేదు. అవి లెబనాన్‌లో కాల్పుల విరమణ, చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్‌కు చెందిన స్తంభింపచేసిన ఆస్తులను విడుదల చేయడం అని ఆయన పేర్కొన్నారు.

చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఈ రెండు డిమాండ్లను అమలు చేయాలని ఆయన చెప్పారు. లెబనాన్‌పై ఇజ్రాయెలీ దాడులను నిలువరించి కాల్పుల విరమణలో లెబనాన్‌ కూడా భాగమేనని ఒప్పుకుంటూ తాను ఇచ్చిన హామీలకు అమెరికా కట్టుబడి ఉండాలని ఇరాన్‌ మంత్రి అరాగ్చీ స్పష్టం చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగితే విస్తృత కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News