మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ దాతృత్వంతో నిజామాబాద్ ఆస్పత్రికి 120 ఐసీయూ పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఆయన ఆధ్వర్యంలోని ‘యూ వీ కెన్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీటిని అందించినట్లు యువరాజ్ తెలిపారు. వర్చువల్ విధానం ద్వారా వీటిని ప్రారంభించారు. బెడ్ల కొరత తీర్చేందుకే ఈ సాయం చేస్తున్నానని అన్నారు. 2.5 కోట్ల రూపాయలతో ఐసీయూ పడకలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, నిజామాబాద్‌ను ఇందులో భాగంగానే ఎంచుకున్నామని ప్రకటించారు.
అభినందించిన హోంమంత్రి…
నిజామాబాద్‌కు 120 ఐసీయూ బెడ్లను ఇవ్వడం ఆనందంగా ఉందని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు యువరాజకు ధన్యవాదాలు ప్రకటించారు. ఇలా చేయడం ద్వారా యువరాజ్ తన గొప్ప మనసును చాటుకున్నారని మహమూద్ అలీ అన్నారు.