Skip to main content

Namaste NRI

బాంబుల వర్షం.. 40 మంది విద్యార్థులు మృతి

అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడ్డాయి. అయితే మినాబ్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాలపై క్షిపణులు పడ్డాయి. ఈ పేలుడులో సుమారు 40 మంది విద్యార్థినులు మరణించారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య పెరుగవచ్చని తెలుస్తున్నది. దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో ఉన్న మినాబ్‌లో ఇరాన్ పారామిలిటరీ దళం రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన మిలటరీ బేస్‌ ఉన్నది. దీని లక్ష్యంగా జరిగిన అమెరికా, ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో బాలికల స్కూల్‌ ధ్వంసమైనట్లు తెలుస్తున్నది.

మరోవైపు ఇరాన్‌ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌ వాణిజ్య నగరం టెల్‌అవివ్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. అలాగే గ‌ల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావ‌రాల‌పై దాడి చేసింది. బ‌హ్రెయిన్‌, అబూదాబీ, ఖ‌తార్‌, కువైట్‌, ఇరాన్‌లోని అమెరికా ఆర్మీ, నేవీ బేస్‌లను ఇరాన్‌ టార్గెట్‌ చేసింది. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దాడులు గల్ఫ్‌ ప్రాంతంలో మరో భారీ స్థాయి యుద్ధానికి దారితీస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events