లక్షలాది మంది అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించి వేస్తామని దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ట్రంప్ ప్రకటించగా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.70 లక్షల మందికిపైగా అక్రమ వలసదారులను భారత్‌తోసహా 192 దేశాలకు పంపించివేసినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఐసీఈ 2,647 మంది భారతీయులను తరలింపు నిమిత్తం నిర్బంధించింది. వీరిలో 1,500 మందిని భారత్‌కు తరలించి వేసింది. మెక్సికో, హోండురాస్, గ్వాటెమాలా తర్వాత నాలుగవ స్థానంలో భారత్ అక్రమ వలసదారుల సంఖ్య నిలుస్తుంది. బైడెన్ పాలనలో చివరి వార్షిక నివేదిక ప్రకారం ట్రంప్ గతంలో మొదటిసారి అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో కూడా ఇంత భారీ సంఖ్యలో అక్రమ వలసవాదుల తరలింపు జరగలేదని తెలుస్తోంది. గడచిన దశాబ్ద కాలంలో ఒక్క సంవత్సరంలోనే ఇంత భారీ సంఖ్యలో తరలింపులు జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రారంభమయ్యే అక్రమ వలసదారుల తరలింపులో ఈ 18వేల మంది భారతీయులు కూడా ఉండనున్నారు.