హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న నాలెడ్జ్ సెంటర్లో అమెరికాకు చెందిన కాల్‌అవే గోల్ఫ్ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 15 న నూతన ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు.
ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా క్యాంప్‌బెల్ విల్సన్‌ను నియమిస్తూ టాటా సన్స్ పేర్కొన్నది.
బ్రహ్మోస్ మిస్సైల్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా ‘డైరెక్ట్ హిట్’ అంటూ హర్షం వ్యక్తం చేసింది.