Skip to main content

Namaste NRI

భారత్‌ విషయంలో పాక్‌ యూటర్న్‌

 భారత్‌ విషయంలో పాక్‌ యూటర్న్‌ తీసుకుంది. భారత్‌, పాకిస్థాన్‌ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని పాకిస్తాన్‌ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పాకిస్థాన్‌ ఓ మంత్రిని కూడా నియమించింది.  ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్‌కు ఇదో ఊరట అని అభిప్రాయపడుతున్నారు. పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన పాక్‌ కేబినెట్‌ భేటీ అయ్యింది. ఈ కేబినెట్‌ భేటీలోనే భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా పాక్‌ వాణిజ్య మంత్రిగా పాకిస్థాన్‌ పీపుల్‌స పార్టీకి చెందిన కమర్‌ జమర్‌ కైరాను నియమించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.  2019లో భారత్‌ విషయంలో పాకిస్థాన్‌ ఓ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో పాక్‌ యూటర్న్‌ తీసుకున్నట్లే లెక్క.

Social Share Spread Message

Latest News