Skip to main content

Namaste NRI

లెహరాయి మొదటి సింగిల్‌ విడుదల చేసిన హీరో కార్తికేయ

రంజిత్‌, సౌమ్య మీనన్‌ జంటగా నటిస్తున్న సినిమా లెహరాయి. గగన్‌ విహారి, రావు రమేష్‌, నరేష్‌, అలీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నదీ చిత్రం. తాజాగా ఈ సినిమా నుంచి గుప్పెడంత  గుండెల్లో ఉంటావే అనే లిరికల్‌ గీతాన్ని హీరో కార్తికేయ విడుదల చేశారు. ఈ పాటను జీకే స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా జావెద్‌ అలీ పాడారు. సినిమాలో ఏడు పాటలుంటాయని, ప్రతి పాట శ్రోతలను ఆకట్టుకుంటుందని దర్శకుడు రామకృష్ణ పరమహంస చెబుతున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది.  ఘంటాడి కృష్ణ సంగీతం అందిస్తున్నారు.  నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ సమర్పణలో ఎస్‌ఎల్‌ఎస్‌ మూవీస్‌ పతాకంపై మద్దిరెడ్డి  శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. రామకృష్ణ పరమహంస దర్శకుడు.

Social Share Spread Message

Latest News