Namaste NRI

35-చిన్న కథ కాదు లో లెక్కల మాస్టారు M. చాణక్య వర్మ

నివేత థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ మూవీ 35-చిన్న కథ కాదు. ఈ చిత్రానికి నందకిశోర్‌ ఈమని దర్శకుడు. రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మాలు. ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని మేకర్స్‌ ఆనందం వెలిబుచ్చారు. ఇందులో ‘లెక్కల మాస్టారు ఎం.చాణక్యవర్మ గా విభిన్నమైన పాత్రలో ప్రియదర్శి నటిస్తున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్‌ గ్లింప్స్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. లెక్కల మాస్టారుగా ప్రియదర్శి కేరక్టర్‌ చాలా ఆసక్తిగా ఉంటుందని, ఆయన లుక్‌, నటన నేచురల్‌గా అనిపిస్తాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఇందులో స్కూల్‌ ఎపిసోడ్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయని వారు తెలిపారు. ఈ నెల 15న సినిమా పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: నికేత్‌ బొమ్మి, సంగీతం: వివేక్‌ సాగర్‌, నిర్మాణం: సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌, వాల్టెయిర్‌ ప్రొడక్షన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events