టీడీపీ ఎన్నారై కార్యకర్త బొద్దులూరి యశస్వి(యశ్)ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు ఇండియాకు వచ్చిన ఆయన్ను శంషాబాద్ విమానాశ్రయం లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. సోషల్‌మీడియా వేదికగా వైకాపా ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకుగానూ యశ్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ కింద నోటిసులిచ్చి వదిలిపెట్టారు. జనవరి 11వ తేదీన విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి, విచారణకు సహకరించాలని సూచించారు.
యష్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. టీడీపీ అభిమాని అయిన యశ్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తరచూ పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.