Namaste NRI

భారత్‌కు చేరనున్న 500 ఏళ్లనాటి హనుమాన్‌ విగ్రహం

సుమారు 500 ఏండ్ల నాటి కాంస్య విగ్రహాన్ని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తిరిగి భారత్‌కు అప్పగించనుంది. ఇది తమిళ కవి, స్వామీజీ తిరుమంకై ఆళ్వార్‌ విగ్రహం. దీనిని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని ఆష్మోలియన్‌ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇది 16వ శతాబ్దానికి చెందినదని ఇండియన్‌ హై కమిషన్‌ తెలిపింది. దీనిని బ్రిటిషర్లు భారత్‌లోని ఓ ఆలయం నుంచి దొంగిలించి పట్టుకుపోయారని చెప్పింది.

బ్రిటిష్‌ వలస పాలకు లు 1897లో వేలాది కంచు, ఇతర లోహాలతో తయారైన కళాఖండాలను దోచుకెళ్లారు. సైనిక కార్యకలాపాల ఖర్చులకు వీటిని లండన్‌లో అ మ్ముకునేవారు. ప్రపంచంలోనే అతి పెద్ద కట్‌ జెమ్స్‌లో ఒకటైన కోహినూర్‌ వజ్రం కూడా బ్రి టిషర్ల వద్ద ఉంది. రెండో ఆంగ్లో-సిక్కు యు ద్ధంలో గెలిచిన ఈస్టిండియా కంపెనీ పంజాబ్‌ నుంచి కోహినూర్‌ వజ్రాన్ని ఎత్తుకెళ్లింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events