
సాయి దుర్గ తేజ్ హీరో గా నటిస్తున్న చిత్రం సంబరాల యేటిగట్టు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 120 షూటింగ్ రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దాదాపు 75 శాతం షూట్ పూర్తయింది. ప్రస్తుతం టీం మూడు భారీ సెట్లను నిర్మిస్తోంది. ఇవి నెక్స్ షూటింగ్ షెడ్యూల్‌కు కీలకమైన బ్యాక్డ్రాప్స్గా వుంటాయి. ఈ సెట్స్‌లో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
