Namaste NRI

8 వ‌సంతాలు ఫ‌స్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు ఫణీంద్ర నర్సెట్టి  ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం 8 వసంతాలు.  దాదాపు 6 సంవ‌త్స‌రాల త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్టిన ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఇక 8 వసంతాలు. సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తుండ‌గా.. తాజాగా ఫ‌స్ట్ లుక్‌తో పాటు కథానాయిక‌ను రివీల్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమాలో మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక స‌నిల్ కుమార్ శుద్ధి అయోధ్య అనే పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీనితో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ వ‌దిలారు. ఇక ఈ పోస్ట‌ర్‌కు ఆమె క‌దిలే క‌విత్వం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు.

ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే,  365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం… అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం. 8 వసంతాలు అంటే 8 స్ప్రింగ్స్ ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events