Skip to main content

Namaste NRI

సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. విశాఖలో

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన థియేటర్ల వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలో అత్యాధునిక హంగులతో కూడిన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. వైజాగ్‌లోని ఇనార్బిట్ మాల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఏషియన్ సినిమాస్ తో కలిసి అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు.

ఈ మల్టీప్లెక్స్ విశాఖ సినీ ప్రియులకు ఒక సరికొత్త మరియు ప్రపంచస్థాయి సినిమా అనుభూతిని అందించనుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఎల్ఈడీ సినిమా స్క్రీన్ అని తెలుస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటి ఎల్ఈడీ ప్రొజెక్షన్ క్యూ-లక్సన్ స్క్రీన్‌ను ఇందులో అమర్చారు. మొత్తం 8 స్క్రీన్లతో, 1,556 సీటింగ్ సామర్థ్యంతో పాటు విఐపి అతిథుల కోసం ప్రత్యేకంగా ఐకాన్ స్టార్ లాంజ్ మరియు 82 లాంజ్ లను ఏర్పాటు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events