Skip to main content

Namaste NRI

భారత్‌ సహా మరో ఐదు దేశాలకు అమెరికా షాక్

రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను ప్రధానంగా కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కల్పించే ఒక బిల్లును అమెరికా సెనేట్‌ శుక్రవారం ఆమోదించింది. దీంతో కొత్త వాణిజ్య ఆంక్షల ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరింది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షలు విధించే లిండ్స్‌ ఓ గ్రాహమ్‌ చట్టం-2026ను సెనేట్‌ 86-11 ఓట్ల తేడాతో ఆమోదించింది.

ఇప్పుడు ఈ బిల్లు ప్రతినిధుల సభకు(హౌస్‌ ఆఫ్‌ రిప్రెంజెటిటివ్స్‌) వెళుతుంది. ముందుగా ఈ బిల్లు చట్టంగా మారి ఆ తర్వాత వాటిని విధించాలా వద్దా అనే విషయంలో ట్రంప్‌కు నిర్ణయాధికారం ఉంటుంది. ఈ బిల్లు అమెరికాకు జరిగే భారతీయ ఎగుమతులపై మరిన్ని సుంకాలు విధించే ముప్పును కలిగిస్తున్నది. రష్యా నుండి చమురు, సహజ వాయువును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న చైనా, భారత్‌, అజర్‌బైజాన్‌, హంగేరీ, స్లోవేకియా వస్తువులపై 100 శాతం వరకు సంకాలు విధించే అవకాశం ఏర్పడింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events