Skip to main content

Namaste NRI

యూఎస్ ఫెడ్ కీలక నిర్ణయం .. వ‌డ్డీ రేట్లు య‌థాత‌థం!

అమెరికా లో ద్రవ్యోల్బణం ఆందోళనకరస్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, ఆ దేశ కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అమెరికా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల ముందు ఈ మేర‌కు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులపాటు జరిగిన పాలసీ సమావేశం అనంతరం వడ్డీ రేట్లను 3.75% నుంచి 4.00% శ్రేణిలోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై స్పష్టత కోసం ఇంకొంత‌ సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉందని, అందుకే ఈసారి పెంపునకు విరామం ఇస్తున్నామ‌ని తెలిపింది.ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలోనే ఉందని ఫెడ్ తన ప్రకటనలో పేర్కొన్న‌ది.

వ‌డ్డీ రేట్ల పెంపును నిలిపివేయడంవల్ల మరిన్ని వివరాలను సేకరించి విశ్లేషించేందుకు అవకాశం లభిస్తుందని తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని తిరిగి రెండు శాతం లక్ష్యానికి సకాలంలో చేర్చేందుకు ఎలాంటి విధానాలు అవసరమో నిర్ధారించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్న‌ది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీరేట్లను పెంచడం లేదా తగ్గించడం వంటి నిర్ణయాలను ఫెడ్ తీసుకుంటుంది. వ‌డ్డీరేట్ల పెంపు ద్వారా రుణాలను, ఖర్చులను తగ్గించి ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events