సందీప్‌కిషన్, రితికా నాయక్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం పవర్‌పేట. కృష్ణ చైతన్య దర్శకత్వం. ఈ చిత్రానికి విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. రితికా నాయక్ పుట్టిన రోజు సందర్భంగా పడమటవీధి జానకిగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఇందులో ఈ భామ సంప్రదాయ వస్త్రధారణలో చూడముచ్చటగా కనిపిస్తున్నది. రాజకీయ నేపథ్యంలో ఆధిపత్య పోరు, ప్రేమ, గౌరవం ప్రధానాంశాలుగా చిత్రాన్ని రూపొందిస్తున్నామని, కథాగమనంలో పడమటవీధి జానకి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే అరవైశాతం చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, రచన-దర్శకత్వం: కృష్ణచైతన్య.















