Skip to main content

Namaste NRI

సౌత్ కరోలినాలో ఎమ‌ర్జెన్సీ!

అమెరికాలో అణుప్రమాదం జరిగింది. సౌత్ కరోలినా రాష్ట్రంలో అమెరికా ఇంధనశాఖకు చెందిన అణు పరిశోధనా కేంద్రంలోని ఒక గదిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో రేడియేషన్ లీకై ఉండవ‌చ్చనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు అత్యవసర పరిస్థితి ని ప్రకటించారు. సౌత్‌కరోలినాలోని సవన్నా రివర్ నేషనల్ లేబరేటరీ గదిలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయని వెల్లడించారు. అయితే రెండు గంటల్లోనే ఆ మంటలను అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు.


ప్రమాదం జరిగిన భవనం బయటకు రేడియో ధార్మికత విడుదల కాలేదని తెలిపారు. ఆ రేడియోధార్మికత ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమైందని, బయట ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదన్నారు. అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా లేబరేటరీ ప్రవేశమార్గాలను మూసివేసిన‌ట్లు తెలిపారు. సమీపంలో రాకపోకలను నిలిపివేశామ‌ని చెప్పారు. ప‌రిస్థితిని స‌మీక్షించి ల్యాబ్ మార్గాల‌ను తెరుస్తామ‌ని, రాక‌పోక‌ల‌ను పునరుద్ధ‌రిస్తామ‌ని వెల్ల‌డించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events