Skip to main content

Namaste NRI

లాస్ ఏంజిల్స్‌లో రామాయణం వరల్డ్ ప్రీమియర్

భారతీయ ఇతిహాసం రామాయణంను వెండితెర దృశ్యమానం చేస్తూ నితేశ్‌ తివారీ తెరకెక్కించిన రామాయణ నవంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. సీతారాముల పాత్రల్లో సాయిపల్లవి, రణబీర్‌కపూర్‌ నటిస్తుండగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామాయణ మొదటి భాగం ప్రపంచ ప్రీమియర్‌ కోసం చిత్ర బృందం లాస్‌ఏంజిల్స్‌కు పయనమైంది. ఈ సందర్భంగా అక్కడి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన సాయిపల్లవి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

భారతీయ సంస్కృతి, ఇతిహాసాల గురించి తెలుసుకోవాలనుకునే విదేశీ ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప అవకాశంగా ఉంటుందని అభిప్రాయపడింది. ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకూ వచ్చిన రామాయణ నేపథ్య చిత్రాలకు ఇది పూర్తిగా భిన్నమైనదని నేను భావిస్తున్నా. ఈ సినిమా ద్వారా అత్యుత్తమ రూపంలో రామాయణాన్ని ప్రేక్షకులు వీక్షిస్తారు. ఉన్నత ప్రమాణాలతో రూపొందించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌, సాంకేతిక హంగులు ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి అని చెప్పింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events