ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన ఫ్రిస్కోకు చెందిన ప్రవాసాంధ్రుడు సతీష్ మండువ అభినందన సభ డల్లాస్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక నాయకులు హాజరై అమెరికా–ఆంధ్రప్రదేశ్ మధ్య పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలను పెంపొందించేందుకు తమ మద్దతు తెలిపారు.

అమెరికా కంపెనీలను ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడి అవకాశాలతో అనుసంధానించడం తన ప్రధాన బాధ్యత అని సతీష్ మండువ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖపట్నంలో గూగుల్ ప్రతిపాదించిన ఏఐ, డేటా సెంటర్ ప్రాజెక్టు, అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలను పెంచుతున్నాయని వివరించారు. టెక్నాలజీ, ఇంధనం, తయారీ, వైద్యం, విద్యా రంగాల్లో అమెరికా సంస్థలతో భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హోస్ట్ కమిటీ సభ్యులు పద్మశ్రీ అశోక్ మాగోజీ, నీతి ఖైతాన్, డా.రాజు కోసూరి, గనపురం మహేందర్, మైని సునీల్, డా. ఉషా పేరి, జూపూడి సంజయ్, కృష్ణ కొరాడకు సతీశ్ మండువ కృతజ్ఞతలు తెలిపారు.

సలహాదారుల బృందం …
పాటిబండ్ల అనీల్ : హోర్మోనియా హోల్డింగ్స్ మాజీ అధ్యక్షుడు
నక్కా కిషోర్ : న్యూవిసో సీఈవో
కృష్ణకుమార్ : టెక్నాలజిస్ట్, మెక్సికో పెట్టుబడుల వ్యవహారాల్లోనూ బాధ్యతలు
గోనుగుంట్ల నీలిమ : యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యురాలు
నన్నపనేని సతీష్ : ఫ్లెక్సెరా గ్లోబల్ ఐఎన్సీ, సీఈవో

ఐటీసర్వ్ మాజీ అధ్యక్షులు, యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ బోర్డులోని సహచరులు, ఆటా, నాట్స్, ఐఏఎన్టీ, తానా, టీపాడ్, టాంఎక్స్, శుభం ఫౌండేషన్, ఐఏఎఫ్సీ, శంకర నేత్రాలయ, సిలికానాంధ్ర సంస్థల నాయకత్వానికి, హాజరైన అథిథులకు సతీశ్ మండువ ధన్యవాదాలు తెలిపారు.















