లండన్లోని క్రొయ్దన్ ప్రాంతంలో క్రొయ్దన్ తెలుగు అసోసియేషన్ (సీటీఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. రిడిల్స్డౌన్ కాలేజియేట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. పట్టుచీరలు, వోణీలు ధరించిన మహిళలు, యువతులు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూలతో అలంకరించిన రంగురంగుల బతుకమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి. గౌరీదేవికి, ప్రకృతి మాతకు సమర్పణగా అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడి నృత్యాలు చేశారు. తర్వాత అందరికీ పసందైన తెలుగు వంటకాలతో భోజన ఏర్పాటు జరిగాయి.

2026 సీటీఏ కమిటి సభ్యులు సాయి ప్రకాశ్, వెంకట్, ప్రవీణ్, మట్టారెడ్డి, చిరంజీవి, శాంతి, అనేక మందివాలంటీర్ల అంకితభావం, సహకారంతో ఈ వేడుకలు విజయవంతంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి కేపీ గ్రూప్స్, మాక్స్ హెల్త్ ఫైనాన్షియల్, అన్నపూర్ణ రైస్, సుక్రోజ్ కన్స్ట్రక్షన్, ఆభరణ సిల్క్స్, క్రిస్పీ దోస, గ్రీన్ ఆపిల్, వ్రిష్కర్ బ్లైండ్స్తో పాటు ఇతర సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించారు.















