భారతీయ ఇతిహాసం రామాయణంను వెండితెర దృశ్యమానం చేస్తూ నితేశ్ తివారీ తెరకెక్కించిన రామాయణ నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. సీతారాముల పాత్రల్లో సాయిపల్లవి, రణబీర్‌కపూర్ నటిస్తుండగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామాయణ మొదటి భాగం ప్రపంచ ప్రీమియర్ కోసం చిత్ర బృందం లాస్ఏంజిల్స్కు పయనమైంది. ఈ సందర్భంగా అక్కడి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన సాయిపల్లవి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

భారతీయ సంస్కృతి, ఇతిహాసాల గురించి తెలుసుకోవాలనుకునే విదేశీ ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప అవకాశంగా ఉంటుందని అభిప్రాయపడింది. ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకూ వచ్చిన రామాయణ నేపథ్య చిత్రాలకు ఇది పూర్తిగా భిన్నమైనదని నేను భావిస్తున్నా. ఈ సినిమా ద్వారా అత్యుత్తమ రూపంలో రామాయణాన్ని ప్రేక్షకులు వీక్షిస్తారు. ఉన్నత ప్రమాణాలతో రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక హంగులు ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి అని చెప్పింది.















