Skip to main content

Namaste NRI

భవిష్యత్తులో డబ్బు అవసరం ఉండదు .. ఎలాన్‌మస్క్‌ సంచలన వ్యాఖ్యలు

కృత్రిమ మేధస్సు(ఏఐ), రోబోట్ల అభివృద్ధి వల్ల భవిష్యత్తులో ప్రపంచం అపారమైన సమృద్ధితో నిండిపోతుందని, అందువల్ల సుదూర భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయడం నిరర్థకమని ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయపడ్డారు. ఏఐ సాంకేతికతలో పురోగతి వల్ల వస్తువులు, సేవలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని ఆయన చాలాకాలంగా చెప్తున్నారు. భవిష్యత్తులో సమృద్ధి అపారంగా పెరిగిపోతుందనే ఆశతో ప్రస్తుతం తీసుకుంటున్న కొన్ని ఆర్థికపరమైన తప్పుడు నిర్ణయాలను సమర్థించుకోవచ్చా? అంటూ ఓ వినియోగదారుడు సరదాగా చేసిన వ్యాఖ్యకు మస్క్‌ వేదికగా స్పందించారు.

అత్యంత తెలివైన సాంకేతికతతో అపారమైన సమృద్ధి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో సుదూర భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయడం నిరర్థకం అని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, మనుషుల ఆకారంలో ఉండే రోబోట్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చగలవని ఆయన పలుమార్లు అభిప్రాయపడ్డారు. 2036 నాటికి డబ్బుకు ప్రాధాన్యం లేకుండా పోవచ్చని ఆయన అన్నారు. ఏఐ, రోబోట్లు ప్రజలు వినియోగించగలిగిన దానికంటే ఎక్కువ వస్తువులు, సేవలను ఉత్పత్తి చేయగలవని ఆయన వివరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events