Skip to main content

Namaste NRI

న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ బరిలో సరిత కోమటిరెడ్డి

న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ పదవికి అధికార రిపబ్లికన్‌ అభ్యర్థిగా తెలంగాణ మహిళ ఒకరు పోటీపడుతున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టి అమెరికాలో అల్‌-ఖైదా, ఐసిస్‌ల కేసుల విచారణలో భాగస్వామి అయిన సరిత కోమటిరెడ్డి అక్కడి ప్రజా జీవితంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ పదవికి రిపబ్లికన్‌ అభ్యర్థిగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు ఉన్న అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

ఫెడరల్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన కాలం నుంచి యూఎస్‌ డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌లో చీఫ్‌ స్టాఫ్‌గా పనిచేసిన కాలం వరకు తనను ఇక్కడికి తీసుకువచ్చిన అనుభవాల గురించి ఆమె మాట్లాడారు. నేరాలు, చిల్లర దొంగతనాలు, మోసాలపై చర్య తీసుకుంటానని ఆమె హామీనిచ్చారు. ప్రజాభద్రత గురించిన ఆందోళనలే తనను ఈ ఎన్నికల బరిలోకి దింపాయని, ఇప్పటికే జీవన వ్యయ సంక్షోభంతో సతమతమవుతున్న న్యూయార్క్‌ వాసులకు నేరాలు, మోసాలు జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అటార్నీ జనరల్‌ నేరాలు, మోసాలపై విచారణ జరపడంపై దృష్టి పెట్టాలని, అలాగే నేరస్తుల నుంచి డబ్బును రాబట్టి దానిని తిరిగి పన్ను చెల్లింపుదారులకు అందజేయాలని ఆమె తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events