Skip to main content

Namaste NRI

ఆదర్శకుటుంబం ఓ వినూత్న కుటుంబ కథ : వెంకటేశ్‌

వెంకటేశ్‌ హీరోగా రూపొందిన ఫ్యామిలీ థ్రిల్లర్‌ ఆదర్శకుటుంబం -హౌస్‌నెం ఏకే 47. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో వెంకటేశ్‌ మాట్లాడారు. ఆదర్శకుటుంబం ఓ కొత్త ప్రయత్నం. త్రివిక్రమ్‌ ఈ కథను అద్భుతంగా మలిచారు. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. మా కాంబినేషన్‌లో వచ్చిన నువ్వునాకు నచ్చావ్‌, మల్లీశ్వరి స్థాయిలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. వినూత్నంగా తీర్చిదిద్దిన ఈ కుటుంబకథను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

నువ్వునాకు నచ్చావ్‌, మల్లీశ్వరి చిత్రాల తర్వాత నేను వెంకటేశ్‌గారితో పనిచేసిన సినిమా ఇది. మా కాంబినేషన్‌ సినిమా అంటే ఆడియన్స్‌లో భారీ అంచనాలుంటాయి. అందుకే ఇంత సమయం తీసుకోవడం జరిగింది. అందరి అంచనాలనూ మించి సినిమా ఉంటుంది అని దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నమ్మకం వెలిబుచ్చారు. వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ ఓ గ్రేట్‌ కాంబినేషన్‌. అలాంటి సినిమాలో నేను కూడా భాగమవ్వడం ఆనందంగా ఉంది అని నారా రోహిత్‌ అన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల నటి శ్రీనిధిశెట్టి ఆనందం వెలిబుచ్చారు. ఫైనల్‌ కాపీ చూసి అంతా ఆనందంతో ఉన్నామని సంగీత దర్శకుడు తమన్‌ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events