సౌమిత్, శ్రేయసిసేన్, కమల్ కామరాజు, చైత్ర ముఖ్య పాత్రల్ని పోషించిన చిత్రం డియర్ ఆస్ట్రోనాట్. కార్తీక్‌భాగ్యరాజ దర్శకుడు. ఈ సినిమాలోని ఓ పాటను అగ్ర దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్ట్రోనాట్ కావాలనే ఓ ఉన్నత లక్ష్యం నేపథ్యంలో సినిమా తీయడం బాగుంది. ఇది చాలా మంచి ప్రయోగం. ఎవరైనా సరే ఎంత పెద్ద కలలైనా కనొచ్చు. వాటిని సాకారం చేసుకోవచ్చు అనే గొప్ప సందేశం ఈ సినిమాలో ఉంది అన్నారు.

ఓ అమ్మాయి భావోద్వేగాల్ని, కలల్ని ఆవిష్కరించే చిత్రమిదని కమల్ కామరాజు చెప్పారు. స్ఫూర్తివంతమైన కథాంశమిదని నటి శరణ్య ప్రదీప్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది.















