యూరప్ దేశాలతో పోలిస్తే భారతదేశంలో గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందని సీసీఎంబీ పరిధోనలో తేలింది. కార్డియోమోపతితో గుండె వైఫల్యం కారణంగా అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. సీసీఎంబీకి చెందిన డాక్టర్ తంగరాజు నేతృత్వంలో పరిశోధనలు జరిపి బీటా`ఎంవైహెచ్`7 జీనోమ్ కారణంగా కార్డియో మోపతి సంభవిస్తోందని తెలిపారు. కార్డియోమోపతితో గుండె వైఫల్యం కారణంగా అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. గుండె అంతర్గత మార్పుల కారణంగా కార్డియో మోపతి విజృంభిస్తోందని గుర్తించింది. ఈ వ్యాధి కారణంగా గుండె శరీరాకానికి కావాల్సిన రక్త సరఫరా సరిగా అందించలేకపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిణామాలతో ఆకస్మిక గుండెపోటుతో మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. భారతదేశంలో గుండె జబ్బులకు 27 కారణాలను, ఏడు మ్యుటేషన్లను గుర్తించినట్టు డాక్టర్ తంగరాజు బృందం తెలిపింది.