Skip to main content

Namaste NRI

యూరప్ దేశాల కంటే భారత్ లో ఎక్కువ

యూరప్‌ దేశాలతో పోలిస్తే భారతదేశంలో గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందని సీసీఎంబీ పరిధోనలో తేలింది. కార్డియోమోపతితో గుండె వైఫల్యం కారణంగా అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. సీసీఎంబీకి చెందిన డాక్టర్‌ తంగరాజు నేతృత్వంలో పరిశోధనలు జరిపి బీటా`ఎంవైహెచ్‌`7 జీనోమ్‌ కారణంగా కార్డియో మోపతి సంభవిస్తోందని తెలిపారు. కార్డియోమోపతితో గుండె వైఫల్యం కారణంగా అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. గుండె అంతర్గత మార్పుల కారణంగా కార్డియో మోపతి విజృంభిస్తోందని గుర్తించింది. ఈ వ్యాధి కారణంగా గుండె శరీరాకానికి కావాల్సిన రక్త సరఫరా సరిగా అందించలేకపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిణామాలతో ఆకస్మిక గుండెపోటుతో మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. భారతదేశంలో గుండె జబ్బులకు 27 కారణాలను, ఏడు మ్యుటేషన్లను గుర్తించినట్టు డాక్టర్‌ తంగరాజు బృందం తెలిపింది.

Social Share Spread Message

Latest News