మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ఆరంభం అయింది. అతడు, ఖలేజా, తర్వాత మహేష్‌బాబు త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర కథానాయిక పూజా హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి పారిశ్రామికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచ్చాన్ చేయగా మహేశ్‌బాబు సతీమణి నమ్రత క్లాప్ ఇచ్చారు. ఒక కొత్త అధ్యాయం ఆరంభం అని మహేష్‌బాబు ట్వీట్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఏప్రిల్‌లో ఆరంభిస్తాం అన్నారు రాధాకృష్ణ. మహేష్‌బాబు 28వ సినిమాగా ప్రత్యేకమైన అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాల్ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత.