Skip to main content

Namaste NRI

మహేశ్ తో త్రివిక్రమ్.. ముచ్చటగా మూడోసారి

మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ఆరంభం అయింది.  అతడు, ఖలేజా, తర్వాత మహేష్‌బాబు త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర కథానాయిక పూజా హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి పారిశ్రామికవేత్త సురేష్‌ చుక్కపల్లి కెమెరా స్విచ్చాన్‌ చేయగా మహేశ్‌బాబు సతీమణి నమ్రత  క్లాప్‌ ఇచ్చారు. ఒక కొత్త అధ్యాయం ఆరంభం అని మహేష్‌బాబు ట్వీట్‌ చేశారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఏప్రిల్‌లో ఆరంభిస్తాం అన్నారు రాధాకృష్ణ. మహేష్‌బాబు 28వ సినిమాగా ప్రత్యేకమైన అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాల్ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత.

Social Share Spread Message

Latest News