అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ ఉక్రెయిన్లో ఆకస్మికంగా పర్యటించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే యుద్ధ భూమికి వచ్చిన ఆమె ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య, ఆ దేశ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కీని కలిశారు. రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశానికి తన సంఫీుభావాన్ని అమెరికా మద్దతును తెలియజేశారు. స్లోవేకియాలో పర్యటించిన జిల్ బైడెన్ అక్కడ ఆశ్రయం పొందుతున్న ఉక్రెయిన్ మహిళలను కలిశారు. ఉక్రెయిన్లోని ఉజ్హోరోడ్ పట్టణంలోని స్కూల్ క్లాస్ రూమ్లో ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కీతో ఆమె సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం క్రూరమైందని ఆరోపించారు. ఈ యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ ప్రజల వెంట అమెరికా ఉంటుందని భరోసా ఇచ్చారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)