Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్‌లో అమెరికా ప్రథమ మహిళ.. అకస్మిక పర్యటన

అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు జో బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్‌ ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే యుద్ధ భూమికి వచ్చిన ఆమె ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య, ఆ దేశ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కీని కలిశారు.  రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశానికి తన సంఫీుభావాన్ని అమెరికా మద్దతును తెలియజేశారు. స్లోవేకియాలో పర్యటించిన జిల్‌ బైడెన్‌   అక్కడ ఆశ్రయం పొందుతున్న ఉక్రెయిన్‌ మహిళలను కలిశారు. ఉక్రెయిన్‌లోని ఉజ్హోరోడ్‌  పట్టణంలోని స్కూల్‌ క్లాస్‌ రూమ్‌లో ఉక్రెయిన్‌ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కీతో ఆమె సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం క్రూరమైందని ఆరోపించారు. ఈ యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షించారు.  ఉక్రెయిన్‌ ప్రజల వెంట అమెరికా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Social Share Spread Message

Latest News