రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటిస్తున్న సినిమా లెహరాయి. గగన్ విహారి, రావు రమేష్, నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నదీ చిత్రం. తాజాగా ఈ సినిమా నుంచి గుప్పెడంత గుండెల్లో ఉంటావే అనే లిరికల్ గీతాన్ని హీరో కార్తికేయ విడుదల చేశారు. ఈ పాటను జీకే స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా జావెద్ అలీ పాడారు. సినిమాలో ఏడు పాటలుంటాయని, ప్రతి పాట శ్రోతలను ఆకట్టుకుంటుందని దర్శకుడు రామకృష్ణ పరమహంస చెబుతున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఘంటాడి కృష్ణ సంగీతం అందిస్తున్నారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ పతాకంపై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. రామకృష్ణ పరమహంస దర్శకుడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)