భారత్ విషయంలో పాక్ యూటర్న్ తీసుకుంది. భారత్, పాకిస్థాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పాకిస్థాన్ ఓ మంత్రిని కూడా నియమించింది. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్కు ఇదో ఊరట అని అభిప్రాయపడుతున్నారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన పాక్ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ కేబినెట్ భేటీలోనే భారత్తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా పాక్ వాణిజ్య మంత్రిగా పాకిస్థాన్ పీపుల్స పార్టీకి చెందిన కమర్ జమర్ కైరాను నియమించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. 2019లో భారత్ విషయంలో పాకిస్థాన్ ఓ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో పాక్ యూటర్న్ తీసుకున్నట్లే లెక్క.