తేజస్విని మడివాడ కథానాయికగా తెరకెక్కిన చిత్రం కమిట్‌మెంట్. నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తేజస్వి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు నేను తెరపై కనిపించిన తీరుకి గుర్తింపు వచ్చింది కానీ, నా నటనకి రాలేదు. ఈ సినిమాతో నటిగానూ పేరొస్తుందని నా నమ్మకం అన్నారు. వాస్తవికతతో కూడిన థకతో రూపొందిన చిత్రమిది. కథ విన్నప్పుడు నాకు ఎదురైన చాలా సంఘటనలు గుర్తుకొచ్చాయి. అందుకే వెంటనే కనెక్ట్ అయ్యాను. ఇందులో నాలుగు కథలుంటే అందులో నాదొక కథ. సహజమైన కథ, పాత్రలు కాబట్టి నటిగా నాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నా. కథకి ఎంత అవసరమో అంత చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. కథ రీత్యానే ఇందులో కనిపిస్తానన్నారు. స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిని నేను. పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని చెప్పారు. అది ఇష్టం లేక పెళ్లి చేసుకోవడమే మనేశా అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)