దేశవ్యాప్తంగా 75వ భారత స్వాతంత్య్ర సంబరాలు ఘనంగా జరిగాయి. మనదేశంతో పాటుగా ఇతర దేశాల్లో కూడా భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అగ్రరాజ్యం అమెరికాలో 75వ భారత స్వాతంత్య్ర సంబరాలను తెలుగు వారు ఘనంగా నిర్వహంచారు. కాలిఫోర్నియా, మిన్నెసోట రాష్ట్రాల్లో వేడుకలు చేసుకున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన వేడుకల్లో సినీనటుడు కమల్‌హాసన్, చెస్ క్రీడాకారిణి సంధ్యా గోలి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పురవీధుల్లో వంద అడుగుల జాతీయ పతాకాన్ని ఊరేగించారు. జాతీయ గీతానిన ఆలపించి గౌరవ వందనం చేశారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. సంస్కాృతిక కార్యక్రమాలు, పోటీ పరీక్షలతో మిన్నెసోట రాజధాని భవనం వద్ద పండుగ వాతావరణం కనిపించింది. అమెరికా ప్రాంతీయ ప్రతినిధులు పాల్గొని భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)