అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితికి యూఎన్ఏ (యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్)` యూఎస్ఏ 11వ యూత్ అజ్జర్వర్‌గా భారత సంతతి చెందిన హిమజా నాగిరెడ్డి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని యూఎన్ఏ, యూఎస్ఏ తాజాగా ప్రకటించింది. ఏడాదిపాటు హిమజ ఐక్యరాజ్య సమితిలో యూత్ అబ్జర్వర్‌గా పని చేస్తుందని వెల్లడిరచింది. హిమజా నాగిరెడ్డి జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్)లో హెల్త్ ఈక్విటీ రీసెర్చ్ ఫెల్లోగా పని చేస్తున్నారు. తాజాగా ఆమె ఎన్విరాన్మెంటల్ ఎపిడెమియాలజీ విభాగంలో హర్వార్డ్ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. 2021 ప్రెసిడెన్షియల్ పబ్లిక్ సర్విస్ ఫెల్లోగా సెలక్ట్ అయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)