75వ భారత స్వాత్రంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించి వినూత్నంగా జరుపుకొన్నారు. జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు సాయిసుధ పాలడుగు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు తరలివచ్చి జాతీయ పతకాలు పట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం క్రీడాపోటీల్లో విజేతకు బహుమతులను ప్రదానం చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకొని అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)