శివ కార్తికేయన్ కథానాయకుడిగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రిన్. మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తుంది. సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుష్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో ప్రేమ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. బింబిలిక్కి పిలాపి.. నీకు నాకు సెట్టయ్యింది సో హ్యాపీ అంటూ అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. డ్యాన్స్ ప్రధానంగా సాగే ఈ పాటకు సంగీత దర్శకుడు తమన్ మాస్ బీట్‌ను అందించారు. శివకార్తికేయన్ నృత్యం ఆకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని రామ్ మిరియాల, రమ్య బెహరా, సాహితీ చాగంటి ఆలపించారు. సత్యరాజ్ కీలక పాత్ర పోషిచారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి అని చిత్ర వర్గాలు తెలిపాయి. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, సంగీతం: తమన్, సమర్పణ: సోనాలి నారంగ్, రచన`దర్శకత్వం : అనుదీప్ కేవీ.