Skip to main content

Namaste NRI

ప్రిన్స్ ఫస్ట్ సింగల్… బింబిలిక్కి పిలాపి విడుదల

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రిన్‌. మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తుంది. సునీల్‌ నారంగ్‌, సురేష్‌ బాబు, పుష్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మాతలు. పాండిచ్చేరి, లండన్‌ నేపథ్యంలో ప్రేమ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ మొదలయ్యాయి. బింబిలిక్కి పిలాపి.. నీకు నాకు సెట్టయ్యింది సో హ్యాపీ అంటూ అనే ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేశారు. డ్యాన్స్‌ ప్రధానంగా సాగే ఈ పాటకు సంగీత దర్శకుడు తమన్‌ మాస్‌ బీట్‌ను అందించారు. శివకార్తికేయన్‌ నృత్యం ఆకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని రామ్‌ మిరియాల, రమ్య బెహరా, సాహితీ చాగంటి ఆలపించారు. సత్యరాజ్‌  కీలక పాత్ర పోషిచారు.  ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి అని చిత్ర వర్గాలు తెలిపాయి. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస, సంగీతం: తమన్‌, సమర్పణ: సోనాలి నారంగ్‌, రచన`దర్శకత్వం : అనుదీప్‌ కేవీ.

Social Share Spread Message

Latest News