చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తామని సినీ వర్గాలు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. రవితేజ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. వాణిజ్య హంగులతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. చిరంజీవిని ఓ శక్తిమంతమైన పాత్రలో, ఇదివరకెప్పుడూ తెరపై చూడని రీతిలో ఆవిష్కరిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే, : కోన వెంకట్, కె.చక్రవర్తి రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎ.విల్సన్, కూర్పు: నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైన్ : ఎ.ఎస్.ప్రకాశ్.