Skip to main content

Namaste NRI

భారీ షెడ్యూల్‌తో మెగాస్టార్‌ చిత్రం స్టార్‌

చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తామని సినీ వర్గాలు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ  చిత్రంలో చిరంజీవికి జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు. రవితేజ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. వాణిజ్య హంగులతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. చిరంజీవిని ఓ శక్తిమంతమైన పాత్రలో, ఇదివరకెప్పుడూ తెరపై చూడని రీతిలో ఆవిష్కరిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, : కోన వెంకట్‌, కె.చక్రవర్తి రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, కూర్పు: నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైన్‌ : ఎ.ఎస్‌.ప్రకాశ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events