తెలుగు విద్యార్థి సంఘం ఆస్ట్రేలియా అల్లుడు ఆధ్వర్యంలో మెల్ బోర్న్ నగరం మోనాష్ యూనివర్సిటీలో వినాయక చవితిని పురస్కరించుకొని గణపతి వేడుకను అంగరంగ వైభవంగా జరిపారు. ముందుగా వినాయకుడుకి పూజ చేశారు. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులను అలరించడం కోసం ఏర్పాటు చేసినా భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ధోల్ బృందం చేసినా డప్పు వాయుధాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొందరూ యువతీ యువకులు పాల్గొని పాలు పాటలకు నృత్యం చేశారు. ఈ పండుగ లో తెలుగు వారే కాకుండా పలు రాష్ట్రాల భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)