మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న చిత్రం జిన్నా. పాయల్ రాజ్‌పూత్. సన్నీలియోన్ కథానాయికలు. ఈషాన్ సూర్య దర్శకుడు. కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అభిమానుల ప్రేమ, వాళ్ల అభిమానం కోసమే మేం సినిమాలు చేస్తాం. జిన్నా నా మనసుకు బాగా దగ్గరైన సినిమా. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మాయిలు అరియాన, విరియానా పాట పాడారు. ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు. అందరం ఒక కుటుంబంలా కలిసి మెలిసి కష్టపడి పని చేశాం అన్నారు కథానాయికలు. ఈ కార్యక్రమంలో జి.నాగేశ్వర్ రెడ్డి, కోన వెంకట్, అనూప్ రూబెన్స్. చమ్మక్ చంద్ర తదితదరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)