Skip to main content

Namaste NRI

జిన్నాకీ టౌమొచ్చింది

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న చిత్రం జిన్నా. పాయల్‌ రాజ్‌పూత్‌. సన్నీలియోన్‌ కథానాయికలు. ఈషాన్‌ సూర్య దర్శకుడు.  కోన వెంకట్‌ స్క్రిప్ట్‌ సమకూర్చడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది.  ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అభిమానుల ప్రేమ, వాళ్ల అభిమానం కోసమే మేం సినిమాలు చేస్తాం. జిన్నా నా మనసుకు బాగా దగ్గరైన సినిమా. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మాయిలు అరియాన, విరియానా పాట పాడారు. ఈ సినిమా  నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు. అందరం ఒక కుటుంబంలా కలిసి మెలిసి కష్టపడి పని చేశాం అన్నారు కథానాయికలు. ఈ కార్యక్రమంలో జి.నాగేశ్వర్‌ రెడ్డి, కోన వెంకట్‌, అనూప్‌ రూబెన్స్‌. చమ్మక్‌ చంద్ర తదితదరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News