గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో శ్రీనివాసు కాకర్ల తెరకెక్కిస్తున్న నాయికా ప్రాధాన్య చిత్రం హలో మీరా. లక్ష్మణరావు దిక్కల, వర ప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఒక పాత్రతో విభిన్నమైన ఎమోషన్స్ చూపిస్తూ ఎంతో థ్రిల్లింగ్ సినిమా తెరకెక్కించాం. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేసే ప్రయాణం. ఆ ఒక్కరోజులో చోటు చేసుకునే పరిణామాలను ఎంతో ఆసక్తికరంగా సినిమాలో చూపించనున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి నెలకొల్పింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో సినిమా విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్. చిన్న, ఛాయాగ్రహణం: ప్రశాంత్ కొప్పినీడి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)