Skip to main content

Namaste NRI

పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో హలో మీరా

గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో శ్రీనివాసు కాకర్ల తెరకెక్కిస్తున్న నాయికా ప్రాధాన్య చిత్రం హలో మీరా. లక్ష్మణరావు దిక్కల, వర ప్రసాదరావు  దుంపల, పద్మ కాకర్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ  సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఒక పాత్రతో విభిన్నమైన ఎమోషన్స్‌ చూపిస్తూ ఎంతో థ్రిల్లింగ్‌ సినిమా తెరకెక్కించాం. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేసే ప్రయాణం. ఆ ఒక్కరోజులో చోటు చేసుకునే పరిణామాలను ఎంతో ఆసక్తికరంగా సినిమాలో చూపించనున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌  ఆసక్తి నెలకొల్పింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో సినిమా విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌. చిన్న, ఛాయాగ్రహణం: ప్రశాంత్‌ కొప్పినీడి.

Social Share Spread Message

Latest News