విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా నటిస్తున్న చిత్రం మట్టి కుస్తీ. చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతుంది. ఆర్‌టి టీం వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై హీరో రవితేజ విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి చల్ చక్కని చిలక ..చిరునవ్వు చక్కెర గుళిక అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు జస్టిస్ ప్రభాకరన్ స్వరపరచిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా హేమచంద్ర పాడారు. ఈ పెళ్లి పాటలో విష్ణు విశాల్, ఐశ్వర్యలక్ష్మిల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది.
