Skip to main content

Namaste NRI

మట్టి కుస్తీ నుంచి అందమైన పెళ్లిపాట

విష్ణు విశాల్‌, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా నటిస్తున్న చిత్రం మట్టి కుస్తీ.  చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ డ్రామా  తెరకెక్కుతుంది.  ఆర్‌టి టీం వర్క్స్‌, విష్ణు విశాల్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై  హీరో రవితేజ విష్ణు విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం  ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.  ఈ సినిమా డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి చల్‌ చక్కని చిలక ..చిరునవ్వు చక్కెర గుళిక అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు జస్టిస్‌ ప్రభాకరన్‌ స్వరపరచిన ఈ పాటకు రెహమాన్‌ సాహిత్యం అందించగా హేమచంద్ర పాడారు. ఈ  పెళ్లి పాటలో విష్ణు విశాల్‌, ఐశ్వర్యలక్ష్మిల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది.

Social Share Spread Message

Latest News